రెండు వేల కోట్ల ప్రజాదనంలో కోటి రూపాయిలు ఇస్తే ఎలా
on Oct 24, 2024
ఇండియన్ చిత్ర పరిశ్రమలో ఉన్న బిగ్ హీరోస్ లో అమీర్ ఖాన్(amir khan)కూడా ఒకడు.దాదాపుగా మూడున్నర దశాబ్దాలపై నుంచి తన అద్భుతమైన నటనతో కొన్ని లక్షల మంది అభిమానులని సంపాదించాడు.ఎన్నో భారీ హిట్స్ తో పాటు నాలుగు జాతీయ పురస్కారాలు,ఏడు ఫిలింఫేర్ అవార్డ్స్ అమీర్ ఖాతాలో ఉన్నాయి.నిర్మాతగానూ పది మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చే సినిమాలని నిర్మిస్తూ కొత్త వాళ్ళకీ అవకాశాలు కల్పిస్తూ వస్తున్నాడు.
అలాంటి వాటిల్లో 2016 లో 'దంగల్'9(dangal)కి ప్రత్యేక స్థానం ఉంది.వరల్డ్ వైడ్ గా రెండు వేల కోట్ల రూపాయలని సాధించి ఇండియాలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన బిగ్గెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.నితీష్ తివారి(nitish tiwari)దర్సకత్వంలో వచ్చిన ఈ మూవీలో మహావీర్ సింగ్ ఫోగట్(mahavir singh phogat)అనే మల్లయోధుడుగా అమీర్ కనిపించాడు.తనకి నలుగురు కూతుళ్లు కావడంతో అందరు ఎగతాళి చేస్తుంటారు.ఆ తర్వాత పట్టుదలతో వాళ్ళకి గురువుగా మల్లవిద్యని నేర్పి అందులో ఇద్దరి కూతుళ్ళకి ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కామన్ వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించేలా చేస్తాడు.ఆ తర్వాత ఒలింపిక్స్ కి ఎంపిక అవుతారు. ఇదంతా హర్యానా లో జరిగిన నిజమైన కథ. బబితా పొగట్,గీతా పొగట్ లు ఆ ఘనతని సాధించారు. లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూ లో బబితా మాట్లాడుతూ దంగల్ సినిమా రెండు వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తే కేవలం కోటి రూపాయిలు మాత్రమే మాకు ఇచ్చారు.దంగల్ సక్సెస్ అయిన తర్వాత అమీర్ టీం మా నాన్నని సంప్రదించింది. తమ గ్రామంలో అకాడమీ నిర్మించడానికి సాయం చెయ్యమని కోరినా వాళ్ళు పట్టించుకోలేదు.
చండీగఢ్ కి చెందిన ఒక విలేకరి నా గురించి అక్క గురించి ఒక ఆర్టికల్ రాసాడు.అది చదివి దర్శకుడు తివారి మా నాన్నని సంప్రదించాడు,మొదట్లో మా గురించి డాక్యుమెంటరీ తీస్తానని చెప్పాడు. ఆ తర్వాత సినిమా తీస్తానని, మా కథ మాకే చెప్పే సరికి ఎంతో ఉద్వేగానికి లోనయ్యాం.సినిమాలో మా పేర్లు ఉండవని,మారుస్తామని చెప్పాడు.కానీ మా నాన్న ఒప్పుకోలేదు. దంగల్ రిలీజ్ అయ్యాక మా ఫ్యామిలీ అంత కలిసి చిన్ననాటి రోజులని గుర్తు చేసుకున్నామని చెప్పుకొచ్చింది.
Also Read